SUBHASHITAM

Name:
Location: India

Sunday, August 02, 2009

ఎరుక లేని వాడి సంత
ఏలే వాడికేరుక
పడకేక్కేంత దాక
పట్టదు కదా వాడి చింత
రంగుటద్దాలలో చూస్తూ
రక్త మాంసాల బరువు పెంచుతూ
తలదన్నే వాడు లేడని వీగుతున్న
ఈ తంతు ఒక వింత

రామ రామ అను చోటికి రామ్ రామ్ అనుకుని
కలిలో కలుస్తవేం అన్ని కాదనుకొని
భారం తనేదని
నడుపుతున్న విభుని
నమ్మి నడుచు వాడె కదా గుణదని
ఒకింత సంభాలించు అన్ని పక్కనపెట్టి
అనంతరూపుని ధ్యానించు ఇప్పుడైనా శ్రద్ధపెట్టి.

నాకు తెలిసిన నేను
నన్ను తెలిసిన లోకానికి చూపలనుకుంటున్నాను
ఈ గాలి తిత్తి నుండి
సంకేత స్వరాలు పంపాలని ప్రయత్నిస్తున్నాను
దగ్ధమవుతున్న ధార్మికతను
అశ్రుధారలతో అర్ప తలపోస్తున్నాను
కలి గాలి ధాటికి కూలుతున్న సంస్కార సౌధాలను
కడ ఊపిరితో కాపాడ ప్రయత్నిస్తున్నాను
నిశీధి పొరలను చీల్చే
ఓంకార కిరణ కణంగా మారి
ఆ తమఘ్న విభు కొలువులో
దివ్యజ్యోతిగా అర్పితమౌతను.